అలెగ్జాండర్‌ నాటకరంగానికి మరోమలుపు -జేసీ అరుణ్‌కుమార్‌

కరీంనగర్‌ టౌన్‌,జూలై 29(జనంసాక్షి): అలెగ్జాండర్‌ నాటక ప్రదర్శన తనను ఎంతగానో ఆట్టుకొందని, అలెగ్జాండర్‌ నాటకం నాటకరం గానికే మరోమలుపు అని జేసీ అరుణ్‌కుమార్‌ అన్నారు. నగరంలోని పద్మనాయక కళ్యాణ మం డపంలో  ఆదివారం  నిర్వహించిన అలెగ్జాండర్‌ నాటక ప్రదర్శనకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఈ నాటకం సామాజిక రుగ్మతల నిర్మూ లనకు వరకట్నం, విద్యార్థుల సమస్యల పరిష్కారించుకోవడానికి ఉపయోగపడ్తుందన్నారు. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ నాటకంలో జయప్రకాశ్‌ రెడ్డి తన ఏకపాత్రాభినయంతో ఆహుతులను అలరించాడు. ఆధునిక కళారంగానికి మరుగున పడ్తున్న నాటకరంగానికి ప్రాణం పోసి, ప్రేక్షకుల హృదయాలను మరో మలుపుకు నాందిగా ఈ నాటకం చాటుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖ నాటక కళాకారులు, విద్యావేత్తలు, ప్రజలు హాజరయ్యారు.