అవార్డు గ్రహీతను సన్మానించిన ఎంపీపీ శరత్ రావు

ముస్తాబాద్ సెస్టెంబరు 10 జనం సాక్షి
ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త మాజీ ఉపసర్పంచ్ కొండ శ్రీనివాస్ గౌడ్ సేవలను గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యులు, సర్దార్ సర్వాయి పాపన్న నేషనల్ అవార్డుకును, నవంబరు 13 ఢిల్లీలో కొండ శ్రీనివాస్ జాతీయ స్థాయిలో అవార్డు తీసుకోబోతున్న సందర్భంగా, ఎంపీపీ జనగామ శరత్ రావు కొండ శ్రీనివాస్ గౌడ్ ను ,శాలువతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా, శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అందరు సహకరిస్తే మండలంలో మరింత సామాజిక కార్యకర్తగ సేవలందిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ,కొమ్ము బాలయ్య ,టిఆర్ఎస్ ఉపాధ్యక్షులు కల్వకుంట్ల శ్రీనివాస్ రావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు, మండల ఆప్షన్ సభ్యులు ఎండి సాదుల్ హుస్సేన్, ఎండి జాంగిర్ భాయ్ ,టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు
Attachments area