అవినీతి పరులకే కేంద్రం ప్రాధాన్యం: కేజ్రీవాల్‌

ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో అవినీతి పరులకే ప్రాధాన్యత ఇచ్చారని సామాజిక కార్యకర్త కేజ్రీవాల్‌ ఆరోపించారు.నిజాయితీగా పనిచేసిన జైపాల్‌రెడ్డిని పెట్రోలియం శాఖనుంచి తప్పించి ప్రాధాన్యతలేని శాఖను ఇచ్చారన్నారు. అవినీతి పరుడైనటువంటి సల్మాన్‌ కుర్షిద్‌కు  మరింత కీలక శాఖ అయినటువంటి విదేశాంగ శాఖను అప్పజెప్పారని కేజ్రీవాల్‌ విమర్శించారు. రిలయన్స్‌ సంస్థ లాబీయింగ్‌ తోనే జైపాల్‌ రెడ్డిని పెట్రోలియం శాఖనుంచి తప్పించారరని ఆయన ఆరోపించారు.