అస్సాంలో వరదల కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులు

లఖింపూర్‌: అస్సాంలో వరదల కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. రెండు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో ధెమజీ, లఖింపూర్‌ జిల్లాలో పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వందలాది గ్రామాలు నీట మునిగాయి. జాతీయరహదారి 15పై రవాణా నిలిచిపోయింది. బిహ్రి గ్రామంలో నిరాశ్రయులైన వందలాది కుటుంబాలు రైల్వే ట్రాక్‌పైకి చేరాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు.