ఆందోళనకరంగానే దారాసింగ్‌ పరిస్థితి

ముంబయి:గుండే పోటుతో ఆసుపత్రిలో చేరిన దారాసింగ్‌ (83)పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు శనివారం ఆయనకు గుండె సంబందిత సమస్యలు రావడంతో ముంబయిలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చారు.ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యుల ఆదివారం మాట్లాడుతూ ప్రస్తుతం ఆయన పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది.వెంటిలేటర్‌ ద్వారా శ్వాస అందిస్తున్నాం ఆయన రక్తపొటును నియంత్రణలోకి తేవడానికి చాలా ఎక్కువ డోన్‌ కలిగిన మందులను వినియోగిస్తున్నాం అని తెలిపారు.ఇంకా పర్యవేక్షణ అవసరమని వివరించారు.