ఆంధ్ర యూనివర్సిటీ వర్క్‌షాపునకు రమేశ్‌కుమార్‌ ఎంపిక

శ్రీకాకుళం, జూలై 15 :
ఆంధ్రయూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ స్టడీస్‌ ఆన్‌ బీ ఆఫ్‌ బెంగాల్‌లో ఈ నెల 16 నుంచి 21వరకు జరిగే కోస్టల్‌ ఎక్విసర్‌ మోనటరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అనే అంశంపై జరిగే వర్క్‌ షాపులో పాల్గొనడానికి టెక్కలి డివిజన్‌ నుంచి రావి వలస ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రమేశ్‌ కుమార్‌ ఎంపికయ్యారు. ఇతని ఎంపికపట్ల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.నర్సింహమూర్తి , ప్రాథమిక పాఠశాల ప్ర ధానోపాధ్యాయుడు పి. సూర్యారావు, ఉపాధ్యాయ సిబ్బంది, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.