గంజాయి అమ్మితే కఠిన చర్యలు తప్పవు

– కల్వకుర్తి సీఐ నాగార్జున
– గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ రిమాండ్
– అభినందించిన నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ
ఊర్కొండ జనవరి 28,( జనం సాక్షి ) ;గంజాయి అమ్మిన వాడిన కఠిన చర్యలు తప్పవని గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించినట్లు కల్వకుర్తి సీఐ నాగార్జున విలేకరుల సమావేశంలో తెలియజేశారు.నాగర్ కర్నూల్ జిల్లా ఉరుకొండ మండల పరిధిలోని ఊర్కొండపేట శివారులో సూర్యలత స్పిన్నింగ్ మిల్ సమీపంలో ఊర్కొండ ఎస్సై కృష్ణ దేవ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.జనవరి 27 మంగళవారం రోజు సాయంత్రం 4 గంటల సమయంలో ఊర్కొండపేట గ్రామ శివారులోని జాతీయ రహదారి పక్కన గల సూర్యలత స్పిన్నింగ్ మిల్ సమీపంలోని పొదల్లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు ఎస్సై కృష్ణదేవ కు సమాచారం అందగా కల్వకుర్తి సి.ఐ నాగార్జున పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది తనిఖీలు చేపట్టగా,పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన ఒడిస్సా కి చెందిన లిట్టు మాలిక్, (35)ఒడిస్సా. (గత 12 ఏళ్లుగా మిల్లులో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు).అభిమన్యు మాలిక్ (32) అనే వ్యక్తులను విచారించగా నిందితులు ఇద్దరూ సూర్యలత స్పిన్నింగ్ మిల్లులో ఆపరేటర్లుగా పనిచేస్తున్నామని,ఒడిస్సాలో తక్కువ ధరకు గంజాయి లభిస్తుండటంతోఇక్కడ ఎక్కువ లాభాలకు విక్రయించాలని పథకం వేశారు. ఈ క్రమంలో ఈనెల 23న ఒడిస్సాలోని తెడీ బజార్‌లో ‘చాచా’ అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి,బస్సులో హైదరాబాద్ మీదుగా మిల్లుకు చేరుకున్నారు.స్వాధీనం చేసుకున్న 2.390 కిలోల గంజాయి (మొగ్గలు, పువ్వులతో కూడినది) విలువ సుమారు రూ. 58,850/- ఉంటుందని అధికారులు తెలిపారు. వారి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.నేరస్తులను పట్టుకోవడంలో చాకచక్యంగా వివరించిన ఊర్కొండ ఎస్ఐ పి. కృష్ణదేవ, కానిస్టేబులు హర్ష,తిరుపతయ్య,వెంకన్న లను నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ అభినందించారు.



