నో- డ్యూ కోసం నేతల పడిగాపులు

సదాశివపేట జనవరి 28(జనం సాక్షి)సామాన్యుడు ఇంటి పన్ను కట్టడం ఒక్కరోజు ఆలస్యం అయితే చాలు… వడ్డీల మీద వడ్డీలు వేసి.. నల్లా కలెక్షన్లు కట్ చేస్తామని భయపెట్టే అధికారులు, రాజకీయ నాయకుల ఇండ్ల వైపు కన్నెత్తి చూడడానికి కూడా సహించరు. ఏళ్ల తరబడి బకాయిలు పేర్కపోయినా అందరూ మనోళ్లే అన్నట్లుగా వ్యవహరించడం మన వ్యవస్థలో ఉన్న చేదు నిజం. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది! నిన్నటిదాకా అధికారులను ఆమడ దూరం ఉంచిన నేతలే.. ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ సార్ మా ఫైల్ చూడండి అంటూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇన్నాళ్లు కట్టని పన్నులను వడ్డీలతో సహా చెల్లించేందుకు పోటీ పడుతున్నారు.
నో – డ్యూ ఉంటేనే నామినేషన్…
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగర మోగడంతో రాజకీయ వర్గాల్లో హడావిడి మొదలైంది. నేటి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమై జనవరి 30తో ముగియనుంది. అయితే ,ఎన్నికల సంఘం విధించిన” నో డ్యూ సర్టిఫికెట్ “నిబంధన ఇప్పుడు ఆశవహుల గుండెలో రైళ్లు పరిగెత్తేస్తుంది. పోటీ చేయాలనుకునే అభ్యర్థి ఎవరైనా సరే.. మున్సిపాలిటీకి చెల్లించాల్సిన ఆస్తి పన్ను, నల్ల బిల్లులు, ఇతర పళ్ళు బకాయిలను నయా పైసా తో సహా చెల్లించాల్సిందే. అవి చెల్లించినట్లు అధికారిక ధ్రువీకరణ పత్రం నో డ్యూ సర్టిఫికెట్ జత చేస్తేనే నామినేషన్ స్వీకరిస్తారు. లేదంటే తిరస్కరిస్తారు.



