అజిత్ పవర్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని, (జనంసాక్షి) : బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ జీ విషాదకరంగా మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి, బాధకు గురి చేసిందని తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఎక్స్( ట్విట్టర్ ) వేదికగా తెలిపారు. ఆయన నాయకత్వం, దశాబ్దాల ప్రజా సేవను స్మరించుకుంటాము.. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు, మహారాష్ట్ర ప్రజలకు తన సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.



