మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం

` పార్టీ పనితీరు, గెలుపు అవకాశాలు లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక
` మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ సీరియస్‌గానే తీసుకుంది
` సీఎం లేనప్ప్పుడు మంత్రులు తనను కలవడంలో తప్ప్పులేదు
` దీనిపై అసత్య కథనాలు రాయడం సరికాదు
` మీడియాతో డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క
ఖమ్మం(జనంసాక్షి): మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక అనేది కేవలం ఒకరిద్దరి నిర్ణయం కాకూడదని, అత్యంత పారదర్శకంగా , సమిష్టిగా సాగాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆయా మున్సిపాలిటీల బాధ్యతలు చూస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు , సీనియర్ నాయకులు అందరూ కలిసి చర్చించి, ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఖరారు చేయాలని సూచించారు. ఖమ్మం జిల్లాలో విÖడియాతో మాట్లాడిన భట్టి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ మున్సిపల్ ఎన్నికలను సీరియస్ గా తీసుకొని పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు.అభ్యర్థుల ఎంపికలో అందరినీ కలుపుకుని పోవడం వల్ల పార్టీలో అంతర్గత విబేధాలు రాకుండా ఉంటాయని, ఇది ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను మెరుగుపరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పార్టీ మండల , పట్టణ స్థాయి నాయకులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఈ పక్రియను విజయవంతం చేయాలని శాసనసభ్యులకు దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి భట్టి విక్రమార్క కొన్ని కీలక మార్గదర్శకాలను విడుదల చేశారు. కేవలం రాజకీయ ప్రాధాన్యతలకు కాకుండా, క్షేత్రస్థాయిలో గెలిచే సామర్థ్యం ఉన్న అభ్యర్థులకే టికెట్లు కేటాయించాలని ఆదేశించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సిద్దాంతాలను నమ్మిన వారు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే అభ్యర్థులపై దష్టి సారించాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న ’ఆరు గ్యారెంటీలు’ , ఇతర అభివద్ధి పనులను ఓటర్లకు వివరించి, వారి మద్దతు పొందే నాయకులను గుర్తించడం ఈ ఎన్నికల్లో అత్యంత కీలమని ఆయన పునరుద్ఘాటించారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, నామినేషన్ల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో అభ్యర్థుల ఖరారు పక్రియను వేగవంతం చేయాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 11న జరగనున్న పోలింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు , మున్సిపాలిటీ బాధ్యులు తదేక దష్టితో పనిచేసి, ఫిబ్రవరి 13న వెలువడే ఫలితాల్లో పార్టీ జెండా ఎగిరేలా కషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విజయాలను ఆయుధంగా మలచుకుని, ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పార్టీ శ్రేణులను ఆయన ఉత్సాహపరిచారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలు గెలిచి రాష్ట్ర అభివద్ధిని ముందుకు తీసుకెళ్తామన్నారు.. నగరాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.ªVన్సిపల్ ఎన్నికల్లో పొత్తుల అంశం పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు భట్టి. తమ కేబినెట్ అంతా ఉమ్మడి కుటుంబంలా పనిచేస్తుంది.. రాష్ట్ర భవిష్యత్తే తమ లక్ష్యమని అన్నారు. ప్యూర్, క్యూర్, రేర్ సమగ్ర విధానంతో తెలంగాణ రాష్ట్ర అభివద్ధి కోసం 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేశామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తనకు కొన్ని సూచనలు చేశారని చెప్పారు. మంత్రులు తెలియజేసిన సమస్యలను తాను ముఖ్యమంత్రికి వివరించానని చెప్పారు. ప్రజాభవన్లో మంత్రుల భేటీపై కొందరు పిచ్చి భ్రమల్లో ఉండి పిచ్చి రాతలు రాస్తున్నారని ఫైర్ అయ్యారు భట్టి. మంత్రులు డిప్యూటీ సీఎంను కలవకపోతే ఇంకెవరిని కలుస్తారని ప్రశ్నించారు భట్టి.సిఎం లేనప్ప్పుడు ప్రధాన సమస్యలను చర్చించేందుకు తనతో కలిసినట్లు వెల్లడించారు.
ప్రజాభవన్ లో మంత్రుల భేటీపై కొందరు పిచ్చి రాతలు రాస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ్గªర్ అయ్యా రు. సీఎం రేవంత్ దేశంలో లేనందున మున్సిపల్ ఎన్నికలపై తనకు కొన్ని సూచనలు చేశారని తెలిపారు. మంత్రులు వారి సమస్యలు తెలియజేశారని ఆ విషయాలను ముఖ్యమంత్రికి వివరించానని చెప్పారు. మంత్రులు డిప్యూటీ సీఎంను కలవకపోతే రాసే వారితో చూపించే వారితో కలుస్తారా? అని ప్రశ్నించారు. తమ క్యాబినెట్ ఉమ్మడి కుటుంబంలా పనిచేస్తోందని, అభివద్ధి, సంక్షేమం రాష్ట్ర భవిష్యత్తు తమ అందరి ఆలోచన లక్ష్యం అని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ నిర్ణయం తీసుకుంటారని.. బల్దియాల్లోనూ అత్యధిక స్థానాలు గెలుస్తా మని ధీమా వ్యక్తం చేశారు. ’మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే అంశాన్ని ప్రజాభవంలో చర్చించాం.నిజామాబాద్ పార్లమెంట్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొన్నిచోట్ల సమస్య ఎదురైనందున అందుకు సంబంధించిన మంత్రులు నాతో సమావేశం అయ్యారు. ప్రజాధరణ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా సేవ చేయాలని కోరుకునేవారు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువమంది మున్సిప ల్ టికెట్లను ఆశిస్తారు అందులో తప్ప్పులే దు. ఆ జిల్లా ఇన్చార్జి మంత్రులు స్థానిక శా సనసభ్యులు సమష్టిగా నిర్ణయం తీసుకొని గెలుపు అవకాశాలు ఉన్న వారికి టికెట్లు కేటాయిస్తరు. సింగరేణి టెండర్ల అంశంలో పూర్తి ఆధారాలతో స్పష్టత ఇచ్చాను. ఇంకా అందులోనే తిరుగుతాను అంటే వాళ్ల కర్మ. ఎన్నికల ముందు ఇచ్చిన హావిÖల్లో 90 శాతం అమలు చేశాం. రేర్, క్యూర్ ప్యూర్ సమగ్ర విధానంతో తెలంగాణ రాష్ట్ర అభి వద్ధి కోసం గ్లోబల్ సమ్మిట్ లో 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేశాం’ అని తెలిపారు.