వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు కేటీఆర్ ను ఆహ్వానించిన పుష్పలత మల్లారెడ్డి

 

భూదాన్ పోచంపల్లి, జనవరి 27 (జనం సాక్షి): భూదాన్ పోచంపల్లి మండలం
కనుముక్కల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ను దేవాలయ చైర్మన్ మాజీ జెడ్పిటిసి కోట పుష్పలత మల్లారెడ్డి మంగళవారం ఆహ్వానించారు. ఈ సందర్బంగా దేవాలయ చైర్మన్ మాట్లాడుతూ ఫిబ్రవరి 22 నుండి 27 వరకు శ్రీశ్రీశ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి 23వ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పడమటి మహిపాల్ రెడ్డి, నూకల దేవి, లింగస్వామి యాదవ్, కోట అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.