నేడు సమ్మక్క ‘ఆగమనం’…!

మహా జాతరలో కీలకఘట్టం..
వనం వీడి…జనంలోకి సమ్మక్క
నేడు సమ్మక్కను గద్దె పై ప్రతిష్టనించనున్న పూజారులు
మంగపేట, మేడారం జనవరి 29 (జనంసాక్షి)
చిలుకలగుట్ట నుండి కుంకుమ భరణి రూపంలో సమ్మక్క దేవతను మేడారం గద్దెల పైకి తీసుకురానున్న ఆదివాసి పూజారులు. పోలీస్,ఆదివాసి సంఘాల నడుమ అత్యంత భద్రత ఐన మూడంచెల భద్రత మధ్య గద్దెల పైకి సమ్మక్క రాక జరగనుంది. సమ్మక్క తల్లి వనం వీడి జనంలోకి రాగానే పోలీసు అధికారులు జిల్లా ఎస్పి సుధీర్ రామ్ నాథ్ కేకన్ గౌరవ సూచికగా గాలిలోకి కాల్పులు జరిపి సమ్మక్కకు స్వాగతం పలుకనున్నారు. అనంతరం చిలకల గట్టును సమ్మక్క తల్లి బయలుదేరి గద్దెల పైకి చేరుకోనున్న కీలక ఘట్టాన్ని కన్నులారా చూసేందుకు కోట్లాది భక్తులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నిన్న సాయంత్రం పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు, కొండాయి నుండి గోవిందరాజులు బయలుదేరి కన్నెపల్లి నుండి సారలమ్మ తో కలిసి జంపన్న వాగును చేరుకొని వాగు నుండి జంపన్నను తీసుకొని బుధవారం రాత్రి 12.34 నిమిషాలకు గద్దెలపై వారి ప్రతిరూపాలతో కొలువుదీరారు. నేడు సమ్మక్క రాక తో మేడారం పరిసర ప్రాంతాలు పూర్తిగా జన సందోహంగా మారిపోయాయి. సారలమ్మ గద్దె పై కొలువుతీరిగా నేడు సమ్మక్క వనం వీడి…జనంలోకి వస్తున్న తరుణంలో మేడారం పరిసర ప్రాంతాల్లో సుమారు 1కోటి కి పైగా భక్తులు చేరుకున్నారు



