హైదరాబాద్ వేదికగా అఖిలభారత పోలీస్ ఫుట్ బాల్ సమరం
` మార్చిలో నిర్వహణ
` ఏర్పాట్లపై బి శివధర్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్(జనంసాక్షి): జనవరి 28:74వ బి.ఎన్. మల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి శివధర్ రెడ్డి వెల్లడించారు. డిజిపి కార్యాలయంలో బుధవారం నాడు జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో డిజిపి శ్రీ బి.శివధర్ రెడ్డి మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలో గతంలో చక్కని ఫుట్ బాల్ క్రీడాకారులు ఉండేవారని, 1956వ సంవత్సరంలో జరిగిన మెల్బోర్న్ ఒలింపిక్స్ లో సెవిÖఫైనల్ చేరిన భారత ఫుట్ బాల్ జట్టులో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏడుగురు క్రీడాకారులు నూర్ మొహమ్మద్, జుల్ఫీకరుద్దీన్, అహ్మద్ హుసేన్, అజీజుద్దీన్, బలరాం, తంగరాజ్, వంటివారు పాల్గొన్నారన్నారు. వీరిలో అయిదుగురు హైదరాబాద్ సిటీ పోలీస్ వారు. ఆ జట్టు కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ కూడా హైదరాబాదీయే. కాలక్రమేనా పోలీసు ఉద్యోగుల్లో ఫుట్ బాల్ క్రీడ పట్ల ఆసక్తి సన్నగిల్లిందని అభిప్రాయపడ్డారు. 74 వ బీ.ఎన్.మల్లిక్ అఖిల భారత ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించే అవకాశం ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు వచ్చిందన్నారు. ఛాంపియన్ షిప్ పోటీల పనులను వేగవంతంగా పూర్తి చేయాల్సి ఉందన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ ఈ ఏడాది మార్చి 23 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు హైదరాబాదులో నిర్వహించనున్నామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 28 రాష్టాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, 11 కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు మరియు 6 కేంద్ర పోలీస్ సంస్థల నుంచి మొత్తం 53 జట్లు ఈ క్రీడా సమరంలో పాల్గొంటాయని డిజిపి తెలిపారు. సుమారు 1060 మంది పురుష క్రీడాకారులు, 350 మంది మహిళా క్రీడాకారులు, కోచ్‌లు, రిఫరీలు మరియు ఇతర అధికారులతో కలిపి మొత్తం 2000 మందికి పైగా ప్రతినిధులు ఈ వేడుకలో భాగస్వాములు కాబోతున్నారన్నారు. మొత్తం 12 రోజుల పాటు సాగే ఈ ఛాంపియన్‌షిప్‌లో 125 మ్యాచ్‌లను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం, అజీజ్ నగర్‌లోని ఎచఎఫ్‌సి గ్రౌండ్, మోయినాబాద్‌లోని శ్రీనిధి ఫుట్‌బాల్ క్లబ్ మైదానాలతో పాటు మరికొన్ని ప్రధాన మైదానాల్లో ఈ పోటీలు జరగనున్నాయన్నారు.ఈ మెగా ఈవెంట్ నిర్వహణకు తాను చైర్మన్ గాను, సైబరాబాద్ సిపి డాక్టర్ ఎం. రమేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా , అడ్మినిస్టేషన్ కమిటీలో ఐపిఎస్ అధికారులు అభిలాషా బిస్త్, అనిల్ కుమార్, సంజయ్ కుమార్ జైన్, వి.సి. సజ్జనార్, అవినాష్ మహంతి, గజరావు భూపాల్ వంటి సీనియర్ అధికారులు వివిధ బాధ్యతలను నిర్వహిస్తారన్నారు. మార్చి 23న జట్ల రిపోర్టింగ్ తో ప్రారంభమయ్యే ఈ క్రీడల షెడ్యూల్‌లో భాగంగా మార్చి 25న మధ్యాహ్నం 3 గంటలకు అధికారికంగా ఆరంభ వేడుకలు జరగనున్నాయని, ఏప్రిల్ 5న తుది పోరు అనంతరం అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ముగింపు వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ టోర్నీ కోసం తెలంగాణ పోలీస్ అకాడవిÖలో క్రీడాకారులందరికీ వసతి సౌకర్యాలు కల్పించడమే కాకుండా, జట్ల రాకపోకల కోసం 45 ప్రత్యేక బస్సులు మరియు అధికారుల కోసం ఇతర వాహనాలను సిద్ధం చేస్తామని, క్రీడాకారుల ఆరోగ్య భద్రత దష్ట్యా ప్రతి గ్రౌండ్ వద్ద ఒక అంబులెన్స్ తో పాటు వైద్య బందం నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.సాంకేతికపరంగా ఈ టోర్నీని పారదర్శకంగా నిర్వహించేందుకు ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ నుండి 40 మంది ప్రతినిధులు మరియు రిఫరీలు హాజరవుతున్నారనీ, మ్యాచ్‌ల సమయంలో తలెత్తే వివాదాల పరిష్కారానికి జ్యూరీ ఆఫ్ అప్పీల్స్ కమిటీని కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ క్రీడా పోటీలకు సంబంధించి ఫిబ్రవరి 5వ తేదీ నుంచే ప్రత్యేక కంట్రోల్ రూమ్ అందుబాటులోకి వస్తుందని, అఖిల భారత స్థాయి పోటీలు రాష్ట్ర ప్రతిష్టను చాటిచెప్పేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి శివధర్ రెడ్డి వెల్లడించారు. అడిషనల్ డిజిపి అనిల్ కుమార్, మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, స్పోర్ట్స్ ఐజిపి డాక్టర్ గజరావు భూపాల్, హైదరాబాద్ శాంతిభద్రతల అడిషనల్ సిపి తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సిపి ఎన్.శ్వేత, విజిలెన్స్ డిఐజి అభిషేక్ మహంతి, యూసఫ్ గూడా బెటాలియన్ కమాండెంట్ మురళీకష్ణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.



