శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా సహస్ర ఘటాభిషేకం

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
భూదాన్ పోచంపల్లి, జనవరి 27 (జనం సాక్షి): పట్టణ కేంద్రంలోని శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో 49వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సహస్ర ఘటాభిషేకం, పొన్నాసేవలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివపంచాయతన యజ్ఞం, పూర్ణాహుతితో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో సాగాయి. అనంతరం స్వామివారి శోభాయాత్రను భక్తి పరవశంతో వేదమంత్రాల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా హాజరైన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి భావాన్ని, సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. శ్రీ మార్కండేశ్వర స్వామి కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తడక వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు భారత లవ కుమార్, మండల అధ్యక్షులు పాక మల్లేష్ యాదవ్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ కళ్లెం రాఘవరెడ్డి, జిల్లా నాయకులు సామ మధుసూదన్ రెడ్డి, తడక రమేష్, దేవాలయ అధ్యక్షులు డాక్టర్ సీత సత్యనారాయణ, ఉపాధ్యక్షులు భారత ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి అంకం యాదగిరి, సహాయ కార్యదర్శి గుర్రం కృష్ణ, కోశాధికారి ఇంజమూరి యాదగిరి, ధర్మకర్తలు చిక్క వెంకటేశం, వనం కృష్ణ, జిట్టా చంద్రమౌళి, మెరుగు యతీనందం, నక్క రామచంద్రం, అటిపాముల నగేష్, బడుగు బాలమణి, గుండు జయలక్ష్మి, దునుక పద్మావతి, పొట్టబత్తిని శిరీష తదితరులు పాల్గొన్నారు.



