అనర్హతపై వేగం పెంచిన స్పీకర్ దానంకు నోటీసులు

` రేపు స్పీకర్ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశం
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల అంశంపై సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వేగం పెంచారు. ఇందుకు సంబంధించి తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నెల 30వ తేదీన ఉదయం స్పీకర్ కార్యాలయంలో హాజరు కావాలని దానం నాగేందర్‌ను ఆదేశించారు. అదేవిధంగా ఫిర్యాదు చేసిన బీఆరఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కూడా నోటీసులు అందాయి. ఇందులో భాగంగా ఉదయం 10:30 గంటలకు బీఆరఎస్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరగనుండగా.. మధ్యాహ్నం 12:00 గంటలకు బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరగనుంది. ఎమ్మెల్యేల అనర్హత అంశంలో జాప్యం జరుగుతోందని భావించిన సుప్రీంకోర్టు ఈ నెల 19న స్పీకర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. చర్యలు తీసుకోకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించిన నేపథ్యంలో, స్పీకర్ పెండింగ్‌లో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలుదానం నాగేందర్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్ అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే అరికపూడి గాంధీ సహా మరో ఏడుగురికి ’క్లీన్ చిట’ లభించిన సంగతి తెలిసిందే. అయితే మిగిలిన ఎమ్మెల్యేలతో పోలిస్తే దానం నాగేందర్ కేసు భిన్నమైనది. ఆయన బీఆరఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బి`ఫామ్‌పై ఎంపీగా పోటీ చేశారు. ఇది స్పష్టమైన ఫిరాయింపు కిందకు వస్తుందని.. అందుకే ఆయనపై అనర్హత వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఒకవేళ స్పీకర్ అనర్హత వేటు వేస్తే, దానం తన ఎమ్మెల్యే పదవిని కోల్పోతారు. మరోవైపు స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే.. దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం కూడా గట్టిగా సాగుతోంది. మొత్తానికి 30వ తేదీన జరిగే విచారణ తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసేలా కనిపిస్తోంది.
నేను బీఆరఎస్‌కు రాజీనామా చేయలేదు
` నాపై అనర్హత పిటిషన్‌కు కొట్టేయండి
` అఫిడవిట్‌లో స్పీకర్‌కు వివరించిన దానం నాగేందర్
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో బీఆరఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే వ్యవహారంలో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీఆరఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై, ఆయన స్పీకర్ కు వినతిపత్రం అందజేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలను దానం నాగేందర్ ఘాటుగా ఖండిస్తూ, ఆ పిటిషన్‌ను కొట్టి వేయాలని స్పీకర్‌ను కోరారు. అఫిడవిట్‌లో దానం నాగేందర్ తాను బీఆరఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, అలాగే పార్టీ తనను సస్పెండ్ చేసినట్లు సమాచారమూ అధికారికంగా తనకు అందలేదని స్పష్టం చేశారు. మార్చి 2024లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి హాజరైన విషయాన్ని అంగీకరించినప్పటికీ, అది పూర్తిగా వ్యక్తిగత హోదాలో జరిగినదేనని చెప్పారు. ఒక పార్టీ సమావేశానికి వ్యక్తిగతంగా హాజరవడమే ఫిరాయింపుగా పరిగణించడాన్ని ఆయన తప్ప్పుబట్టారు. విÖడియా కథనాల ఆధారంగా తాను పార్టీ మారినట్లు బీఆరఎస్ భావించడం అనుచితమని, ఆ నిర్దారణకు చట్టపరమైన ఆధారాలు లేవని చెప్పారు. అనర్హత పిటిషన్ రాజకీయ ప్రయోజనాల కోసం దాఖలు చేయబడిందని వాదించిన దానం నాగేందర్, పిటిషన్‌లో బలం లేదని, అందువల్ల దానిని కొట్టి వేయాలని స్పీకర్ కోర్టును కోరుతూ తన అఫిడవిట్‌ను ముగించారు.



