విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
` ఆయనతో పాటు ఇద్దరు సహాయకులు, ఇద్దరు పైలెట్లు మతి
` ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కి యత్నించి.. బండరాయిని ఢీ కొట్టడంతో దుర్ఘటన
` ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబయి నుంచి బారామతి వెళ్తుండగా ఘటన
` ఆయన అకాల మరణం తీరని లోటు
` రాష్ట్రంలో మూడు రోజుల పాటు సంతాప దినాలు
` మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ప్రకటన
` ఘటనపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము దిగ్భ్రాంతి
` కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్, సీఎం రేవంత్ సంతాపం
ముంబై (జనంసాక్షి):మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది ఈ దుర్ఘటనలో పవార్ (66)తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబయి నుంచి బారామతి వెళ్తుండగా ఉదయం 8.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ముంబయి నుంచి బయల్దేరిన గంట తర్వాత విమానంలో సమస్య తలెత్తింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపుతప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు విమానం రెండు ముక్కలైనట్లు తెలుస్తోంది. విమాన ప్రమాదంపై డీజీసీఏ (ఆఉఅం) స్పందించింది. విమానంలో ఎవరూ బతికి లేరని వెల్లడించింది. అజిత్ పవార్‌తో పాటు ముంబయి పీఎస్‌వో వదీప్ జాదవ్, కెప్టెన్ సుమిత్ కపూర్, కెప్టెన్ శాంభవి పాఠక్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి మరణించినట్లు తెలిపింది.అజిత్ పవార్ 1959 జులై 22న జన్మించారు. ఆయన తండ్రి అనంత్‌రావ్ పవార్.. సీనియర్ రాజకీయ నాయకుడు, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్‌కు సోదరుడు. బాబాయి శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అజిత్‌పవార్.. 1982లో తొలిసారి కార్పొరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 16 ఏళ్ల పాటు పుణె జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్‌గా వ్యవహరించారు.
1991లో తొలిసారి బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతరం బాబాయి శరద్ పవార్ కోసం ఆ సీటును త్యాగం చేసి.. రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. 1991 ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం సీఎం దేవేంద్ర ఫడణవీస్ నేతత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. అజిత్ పవార్‌కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. భార్య సునేత్ర పవార్ రాజ్యసభ ఎంపీగా వ్యవహరిస్తున్నారు.
బండరాయిని ఢీకొట్టి..
ప్రమాద సమయంలో పుణె, బారామతి ప్రాంతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో విజిబిలిటీ తక్కువగా ఉంది. ఇది కూడా ప్రమాదానికి కారణమై ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్న క్రమంలో విమానం నియంత్రణ కోల్పోయింది. దీంతో ఓ బండరాయిని ఢీకొట్టడంతో విమానం నుంచి భారీగా మంటలు చెలరేగాయి.
ఘటనపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము దిగ్భ్రాంతి
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్, సీఎం రేవంత్ సంతాపం
అజిత్ పవార్ మతిపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాగ్భ్భాంతి వ్యక్తంచేశారు. ఈ ప్రమాద ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో మోదీ, అమిత్ షా మాట్లాడారు. ‘విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మహారాష్ట్రకు ఇది కోలుకోలేని నష్టం. రాష్ట్ర అభివద్ధికి ఆయన ఎంతో కషి చేశారు. పవార్ కుటుంబానికి, ఆయన మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ `రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
‘మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మతిగ్భ్భాంతి కలిగించింది. అట్టడుగు స్థానం నుంచి రాజకీయ నేతగా ఎదిగిన ఆయన ప్రజా నాయకుడిగా మహారాష్ట్ర ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ ` ప్రధాని నరేంద్ర మోదీ
‘మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మతి వార్త వినగానే తీవ్రగ్భ్భాంతికి గురయ్యాను. మేము ఎప్పుడు కలిసినా, మహారాష్ట్ర ప్రజల సంక్షేమానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించుకునేవాళ్లం. ఆయన మరణం ఎన్డీఏ కుటుంబానికి తీవ్ర నష్టం. ఈ కష్ట సమయంలో మేమంతా పవార్ కుటుంబానికి అండగా ఉంటాం’ హోంమంత్రి అమిత్ షా
‘మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాల మరణం గురించి తెలిసి తీవ్రగ్భ్భాంతికి గురయ్యాను. తన సుదీర్ఘ ప్రజా జీవితంలో మహారాష్ట్ర అభివద్ధి, శ్రేయస్సుకు ఆయన ఎంతో కషి చేశారు. ఆయన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు, అభిమానులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను’ ` రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
‘విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మతి చెందడంగ్భ్భాంతికరం. పవార్ కుటుంబసభ్యులకు, అనుచరులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’. `కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
‘విమాన ప్రమాదంలో అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోవడం నన్ను తీవ్ర వేదనకు గురిచేసింది. ఆయన మతితో రాష్ట్రంలో విషాద వాతావరణం నెలకొంది. వ్యక్తిగతంగా ఆయన నాకు మంచి స్నేహితుడు. పరిపాలనలో ఎదురైన ఎన్నో సవాళ్లను ఇద్దరం కలిసి ఎదుర్కొన్నాం. మహారాష్ట్ర అభివద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటున్న సమయంలో ఆయన అకాల మరణం తీరని లోటు. రాష్ట్రంలో మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటిస్తున్నాం’ ` మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్
‘విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మతి చెందిన వార్తలు చూసి తీవ్రగ్భ్భాంతికి గురయ్యాను. ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు, అనుచరులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను’ ` ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
‘మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఆయన కుటుంబ సభ్యులకు, అనుచరులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ ` తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
‘విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మతి చెందిన ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశిస్తున్నాం’ ` కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
‘అజిత్ పవార్ ఆకస్మిక మరణం విచారకరం. మహారాష్ట్రలో ఇది చీకటి రోజు. ప్రమాదం గురించి తెలియగానే ఆయన సురక్షితంగా ఉండాలని దేవుడిని ప్రార్థించాను. ఇంతటి ఘోరం జరుగుతుందనుకోలేదు. అజిత్ పవార్‌కు బారామతితో ఎంతో అనుబంధం ఉంది. అక్కడే ఆయన మరణించడం విషాదకరం. ఆయనకు ఇలా నివాళులు అర్పించాల్సి వస్తుందనుకోలేదు’ ` ఎంపీ సంజయ్ రౌత్
‘అజిత్ పవార్ ఆకస్మిక మరణంతో తీవ్రగ్భ్భాంతికి గురయ్యాను. పవార్ కుటుంబానికి, ఆయన అనుచరులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను కోరుతున్నా ‘ ` పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
అజిత్ పవార్ మతి వార్తలు చూసిగ్భ్భాంతికి గురయ్యాను. మా పార్టీల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ ప్రజల కోసం మేము కలిసే పని చేశాము. ఆయన నిరంతరం రాష్ట్ర ప్రజల అభివద్ధి కోసమే ఆలోచించేవారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ ` శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది
అజిత్ విమాన ప్రమాదంలో కుట్ర కోణం
` సుప్రీం పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలి
` సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా(జనంసాక్షి):విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్ ప్రాణాలు కోల్పోయిన ఘటనపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. అజిత్ మతిలో కుట్రకోణం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం దేశంలో రాజకీయ నాయకుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోందన్నారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అజిత్ మతి చెందిన వార్త తనను దిగ్భాంరతికి గురిచేసిందని విÖడియాతో మాట్లాడుతూ మమతా బెనర్జీ అన్నారు. బీజేపీని వీడాలని ఆయన ఆలోచిస్తున్నారని ఇటీవల జరిగిన ప్రచారాన్ని ప్రస్తావిస్తూ, రాజకీయ నాయకులకు సైతం భద్రత లేకుండా పోతోందన్నారు. ఈ ఘటన అనేక ప్రశ్నలకు తావిస్తోందన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో మాత్రమే దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అత్యున్నత న్యాయస్థానం విÖద మాత్రమే తమకు నమ్మకం ఉందని, మరో ఇతర దర్యాప్తు సంస్థలపైన విశ్వాసం లేదని, దర్యాప్తు సంస్థలు తమ స్వేచ్ఛ కోల్పోయాయని ఆరోపించారు. కాగా, బారామతి విమాన ప్రమాదంపై విచారణ జరిపించాలని పలువురు రాజకీయ నేతలు సైతం డిమాండ్ చేశారు. అజిత్ పవార్ మతికి సంతాపం తెలుపుతూ ఇందుకు దారితీసిన ప్రమాద ఘనటపై పారదర్శకమైన దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, వంచిత్ బహుజన్ అఘాడి నేత ప్రకాష్ అంబేద్కర్ తదితరులు కోరారు.
అది ప్రమాదమే.. రాజకీయం చేయొద్దు
` శరద్ పవార్
ముంబై(జనంసాక్షి):మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణంపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ స్పందించారు. విమాన దుర్ఘటన పూర్తిగా ప్రమాదమేనని.. దీన్ని రాజకీయం చేయొద్దని అన్నారు. విమాన ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో తొలిసారి విÖడియా ముందుకు వచ్చిన శరద్ పవార్.. అజిత్ మరణం తీవ్ర దుఃఖాన్ని మిగిల్చిందన్నారు.“అజిత్ పవార్ అకాల మరణం తీవ్రగ్భ్భాంతిని కలిగించింది. ఓ సమర్థుడైన నాయకుడిని రాష్ట్రం కోల్పోయింది. జరిగిన నష్టాన్ని పూడ్చలేం.. కానీ, ప్రతిదీ మన చేతుల్లో లేదు. ఈ ఘటనను రాజకీయం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇందులోకి రాజకీయాలు తీసుకురావద్దు. ఇది పూర్తిగా ప్రమాదమే. ఈ ఘటన నాతోపాటు రాష్ట్రం మొత్తానికి తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. దయచేసి ఈ విషాదాన్ని రాజకీయం చేయొద్దు” అని శరద్ పవార్ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు అజిత్ పవార్ విమాన ప్రమాదంపై మమతా బెనర్జీ స్పందిస్తూ.. ఇందులో కుట్ర కోణం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసిన ఆమె.. అత్యున్నత న్యాయస్థానంపైనే తమకు నమ్మకం ఉందన్నారు. ఈ క్రమంలో ఇటువంటి ఊహాగానాలకు తెరదించేందుకే తాను విÖడియా ముందుకు వచ్చినట్లు శరద్ పవార్ పేర్కొన్నారు.


