ఆకృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సినీ నటి కీ,,శే,, భానుమతి జయంతి కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన ఉప్పల శ్రీనివాస్ గుప్త

సెప్టెంబర్ 7 (జనం సాక్షి) హైదరాబాద్

 

హైదరాబాద్ నాగోల్ లోని తన కార్యాలయంలో ఆకృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సినీ నటి కీ,, శే,, భానుమతి గారి జయంతి కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరై పూలమాల వేసి నివాళులర్పించిన రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్ధ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త

ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ…

భానుమతి గారు మంగమ్మ గారి మనుమడు సినిమాలో నటన చేసి, డైరెక్టర్, రచయిత, కథానాయికగా ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసిన భానుమతి రామకృష్ణ గారు నటనలు చేసి దేశంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన నటిగా గుర్తింపు రావడం శుభదాయకం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆకృతి ఫౌండేషన్ అధ్యక్షులు సుధాకర్, దైవజ్ఞ శర్మ, రామచంద్రం, రాజు, ప్రవీణ్ కుమార్, నవీన్, శంకర్, సంపత్, మాధవి, ఫౌండేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.