ఆగ్రోస్ ఎరువుల కేంద్రాన్ని ప్రారంభించిన

share on facebook
ఎమ్మెల్యే మదన్ రెడ్డి
జనం సాక్షి/ కొల్చారం మండలం దుంపలకుంట చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన  ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఇక్కడి రైతులకు మేలు చేకూరుతుందన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు,ఎరువులను నాణ్యమైనవిగా గుర్తించి, అప్పుడు మాత్రమే రైతులకు విక్రయించాలన్నారు.నకిలీ విత్తనాలు అమ్మే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, రైతులను మోసం చేసే వ్యాపారులపై కేసులు చేసేందుకు ప్రభుత్వం వెనకాడదన్నారు. రాష్ట్రంలోని కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాతిగా పనిచేస్తుందన్నారు. అన్నం పెట్టే రైతుకు ప్రభుత్వం ద్వారా అవసరమైన అన్ని పథకాలను అందించడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ముందంజలో ఉందన్నారు. దుంపలకుంట చౌరస్తాలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి సహకారంతోనే ఆగ్రో సేవా కేంద్రం మంజూరు అయిందని ఏడిగడ్డ మందాపూర్ గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కలాలి రాజా గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులను ఆగ్రో సేవా కేంద్రం యజమానులు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రం గౌడ్, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు మన్సూర్ అహ్మద్, ఎంపీపీ మంజుల, జెడ్పీటీసీ మేఘమాల,ఎనగండ్ల గ్రామ సర్పంచ్ వీరారెడ్డి, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, నర్సాపూర్ ఆత్మ కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి, కౌడిపల్లి ఆత్మ కమిటీ మాజీ చైర్మన్

Other News

Comments are closed.