ఆజాద్‌తో భేటీ కానున్న తెలంగాణ ప్రాంత మంత్రులు

హైదారాబాద్‌: నగర పర్యటనకు వస్తున్న కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ గులాంనబీ ఆజాద్‌తో భేటీ కావాలని తెలంగాణ ప్రాంత మంత్రులు నిర్ణయించారు. ఈ సాయంత్రం సమన్వయ కమిటీ సమావేశం అనంతరం ఆజాద్‌తో భేటీ కానున్నట్లు మంత్రులు  తెలియజేశారు.  ఈ నెల 28న జరగనున్న అఖిపలక్ష సమావేశంలో తెలంగాణపై అనుకూల అభిప్రాయం చెప్పాలని మంత్రులు ఆజాద్‌ను కోరనున్నట్లు సమాచారం తెలిసింది.