ఆటోను ఢీ కొంన్న లారీ

రణస్థలం: శ్రీకాకుళం: లావేరు మండలం బోరపేట సమీపంలో కూలీలతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది.  ఈప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా 9 మందికి గాయాలయ్యాయి. మృతులను రణస్థలి మండలం మహంతపాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. క్షతగ్రాతులను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.