ఆటోపై పడిన పెద్ద వృక్షంఆటోపై పడిన పెద్ద వృక్షం తృటిలో తప్పిన పెను ప్రమాదం ప్రయాణికులకు గాయాలు
ఏటూరునాగారం (జనం సాక్షి),మార్చి.20. ఏటూర్ నాగారం చిన్నబోయినపల్లి జాతీయ రహదారిపై ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఆటోపై చెట్టు విరిగిపడిన సంఘటన సోమవారం జరిగింది వివరాల్లోకి వెళితే మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన బొల్లికొండ శ్రీకాంత్ తన ఆటోలో 8 మంది ప్రయాణికులను ఎక్కించుకొని ఏటూర్ నాగారం వైపు వస్తుండగా ఏటూర్ నాగారం చిన్నబోయినపల్లి జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఆటో పై అకస్మాత్తుగా రహదారి ప్రక్కన ఉన్న పెద్ద చింత చెట్టు ఆటోపై పడింది దీంతో ప్రయాణికులకు గాయాలయ్యాయి తృటిలో పెను ప్రమాదం తప్పింది ఆటో పూర్తిగా ధ్వంసం అయింది