ఆడబిడ్డలకు కానుకగా బతుకమ్మ చీరలు

స్టేషన్ ఘనపూర్, (చిల్పూర్)  సెప్టెంబర్ 28, ( జనం సాక్షి ) :
తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగసందర్భంగా ఆడబిడ్డలకు కానుకగా బతు కమ్మ చీరలు అందజేయడం జరుగుతుంది అని సర్పంచ్ బానోత్ రూప్లా నాయక్, వైస్ ఎంపీపీ భూక్య సరిత అన్నారు. చిల్పూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో గ్రామసర్పంచ్ బానోత్ రూప్లా నాయక్, వైస్ ఎంపీపీ భూక్య సరిత బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలను కాపా డుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభి వృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రజలు, మహిళలు,ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని అన్నా రు.ఈకార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీరంగారెడ్డి,కారోబార్ రతన్ సింగ్,వార్డు సభ్యులు భూక్య లక్ష్మి, బాలు,బుజ్జమ్మ,పద్మ,మాజీ సర్పంచ్ రాంలాల్, నరసింహ,కడియం యువసేన అధ్యక్షు డు భూక్య సంజీవ, గ్రామ పంచాయతీ సిబ్బంది, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.