ఆత్మీయ సమ్మేళనంలో నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

ఆత్మీయ సమ్మేళనంలో నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రతీ చోట అడ్డంకులు సృష్టించి అసత్య ప్రచారాలు చేస్తున్నరుజనం సాక్షి, చెన్నరావుపేటపార్టీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు గర్వపడేలా మండల అభివృద్ధిని చేస్తున్నాననీ,పంట నష్టపరిహారం పార్టీలకతీతంగా ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి అందిస్తాము.కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీ అభివృద్ధి కోసం నాయకులు కృషి చేయాలి.ప్రభుత్వ అందిస్తున్న ప్రతి పథకం లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అందే విధంగా నాయకులు సహకరించాలి. వారికి ఏ సమస్య ఉన్న కుటుంబ సభ్యుడిగా ముందుండి ఆదుకొని భరోసానింపాలి. వేసవికాలంలో కూడా చెరువుల నిండి ఈ ప్రాంతమంతా పచ్చదనంతో కలకలలాడుతుంది దానికి గల కారణం కేసీఆర్ పాలనేనని మనం గర్వంగా చెప్పుకోవాలి. గిరిజన తండాలు గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దబడిన తర్వాత అనేక మందికి రాజకీయ అవకాశాలు దక్కాయి. ఒకప్పుడు అభివృద్ధికి నోచుకోని గిరిజన గ్రామాల్లో నేడు అభివృద్ధి పథంలో పరుగులు పెడుతున్నాయి.నాయకులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలి. దానికి సంబంధించి పక్క ప్రణాళికగా ముందుకు సాగుదాం.ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన మళ్లీ రానున్నది మన ప్రభుత్వమే.మిగిలిన పనులను సకాలంలో పూర్తి చేసుకొని, మరోసారి నర్సంపేట గడ్డపై గులాబీ జెండా ఎగరవేద్దాం.నాయకులు, కార్యకర్తలు నాకు కుటుంబ సభ్యులతో సమానం.వారిపై నాకున్న ప్రేమ, ఆప్యాయత, వారితో నాకున్న అనుబంధం విడదియ్యరానిది.నిత్యం ప్రజల్లో ఉంటూ, క్రమశిక్షణ కలిగిన నాయకులకు గులాబీ జెండా అన్నివేల అండగా ఉంటుంది.యొక్క ఆత్మీయ సమ్మేళనం మన భవిష్యత్తు కార్యచరణకు దిశానిర్దేశం చేస్తూ అందరిలో స్ఫూర్తి నింపుతుందని ఆశిస్తున్నా అని అన్నారు. ఈ మండల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీపీ ల ఫోరం జిల్లా అధ్యక్షులు బాధవత్ విజేందర్, జడ్పిటిసి పత్తి నాయక్,రైతు సమన్వయ సమితి కన్వీనర్ బుర్రి తిరుపతి, జిల్లా డైరెక్టర్ తూటి శ్రీనివాస్, మండల పార్టీ నాయకులు బాల్నే వెంకన్న, బద్దునాయక్, సొసైటి చైర్మన్లు సత్యనారాయణ రెడ్డి,మురహరి రవి,సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు కుండే మల్లయ్య తో పాటు నాయకులు, క్లస్టర్ బాధ్యులు, అమీనాబాద్, పత్తి నాయక్ తండా, లింగగిరి, తోపనగడ్డ తండా, బాపు నగర్, కందిగడ్డ తండా, శంకరం తండా, ఖాదర్ పేట, సూర్యాపేట తండా, గొల్లభామ తండా, గొల్లపల్లి గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.