ఆన్‌లైన్‌లో నీటి బిల్లుల చెల్లింపులు
హైదరాబాద్,నవంబర్22: ఆన్‌లైన్‌లో నీటి బిల్లులను చెల్లించేందుకు కూడా అధికారులు వెసులుబాటు కల్పిస్తున్నారు. నీటి బిల్లులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వాటర్‌బోర్డు తెలియజేసేందుకు ఇకనుంచి విని యోగదారులు ఈ-మెయిల్ ఐడీతో పాటు, క్యాన్ నెంబర్ వివరాలు, గతనెల బిల్లుకు సంబంధించిన నెంబర్‌ను తెలియజేయాల్సి ఉంటుంది. ఇలా తెలిపిన తర్వాత వారి పూర్తి వివరాలను, నెల నెలా బిల్లులకు సంబంధించి సమాచారాన్ని సంబంధిత వినియోగదారుల వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు. నీటి వినియోగదారులకు మరింత ఉత్తమ సేవలు అందించేందుకు మెట్రోవాటర్‌బోర్డు అధికారులు ప్రయోగాలు చేపడుతున్నారు. ఇప్పటికే నేరుగా విూటర్ రీడర్ల ద్వారా బిల్లులను అందిస్తున్నారు. అలాగే ఇంటింటికి వెళ్లి ఇ-పాక్స్ మిషన్ల ద్వారా స్పాట్ బిల్లింగ్ వ్యవస్థను కూడా నిర్వహిస్తున్నారు. అయినా ఇప్పటికీ చాలామంది తమకు బిల్లులు సకాలంగా రావడం లేదన్న ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు మరింత సులభంగా నీటి బిల్లుల వివరాలను తెలుసుకునేందుకు ఉన్నతాధికారులు అవసరమైన ఏర్పాట్లు- చేస్తున్నారు.బిల్లుల వివరాలను ఇక నుంచి ఇంటర్నెట్, ఫేస్‌బుక్ ద్వారా కూడా తెలుసుకునే అవకాశాన్ని కలిస్తున్నట్టు- మెట్రోవాటర్‌బోర్డు అధికారులు తెలిపారు. వినియోగదారులు ఈ-మెయిల్ ఐడీని వాటర్ బోర్డులోని మెట్రో కస్టమర్ సెంటర్ (ఎంసీసీ)లో నమోదు చేసుకోవాలంటున్నారు. లేదా 155313కి ఫోన్‌చేసి నమోదు చేసుకోవచ్చంటున్నారు. ఫేస్‌బుక్ ద్వారా కూడా బిల్లుల వివరాలను తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కూడా బోర్డులోని ఎంసీసీ విభాగంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.



