ఆపదలో అండగా నిలుస్తున్న గ్రామ అభివృద్ధి కమిటీ
హుస్నాబాద్ రూరల్ సెప్టెంబర్25(జనంసాక్షి) చౌటపల్లి గ్రామంలో ఇప్పకాయల దత్తాద్రి(70) అనారోగ్యంతో మృతిచెందగా,వారి కుటుంబానికి రూ 5000 వేలు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సర్పంచ్ గద్దల రమేష్ చేతుల మీదుగా అందజేశారు.గ్రామంలో ఎవరు మరణించిన,వారి దహణసంస్కరణలను నిమిత్తం ఖర్చులను గ్రామ అభివృద్ధి కమిటీ అందించుటకు సంసిద్దంగా ఉన్నట్లు గ్రామ సర్పంచ్ గద్దల రమేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొత్తకొండ పోశెట్టి,వార్డు సభ్యులు ఆవుల పద్మ కొమురయ్య,ఇల్లందుల లావణ్య రమేష్,పత్తిపాక లావణ్య త్రిమూర్తి,చుంచు రాజకుమార్,కోఆప్షన్ సభ్యులు ఆవుల చిన్న వెంకటయ్య,పులికాశి రమేష్ గ్రామ రైతు సంఘం అధ్యక్షులు ఆవుల పెద్ద వెంకటయ్య,బొడుమల్ల సంపత్,గంగాదరి లింగం,గంగాదరి చంద్రం,ఆవుల వెంకట్రాజ్,ఆవుల సాంబరాజ్,ఇటుకల అనిల్,తదితరులు పాల్గొన్నారు.