ఆపదలో రక్తదానం

నిజామాబాద్‌ రక్తదానం ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి గొప్ప అవకాశమని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్‌ దుగుల్‌ అన్నారు ఆయన పోలీసు సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమావారం పోలీసు కార్యలయంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఎస్పీతో పాటు వంద మంది పోలీసు కాని స్టేబుళ్ళు రక్తదానం చేశారు పోలీసులు విధి నిర్వహణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని ఎస్పీ సూచించారు వారోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు పోలీసు కుటుంబాల పిల్లలకు వ్యాసరయన  ఆటల పోటీలు నిర్విహించనున్నట్లు ఆయన తెలిపారు.