ఆప్గనిస్థాన్‌లో ఉగ్రవాది దాడి 25 మంది మృతి
కాబూల్: ఆప్గనిస్థాన్‌లోని తూర్పుప్రాంతంలో జరిగిన అత్మాహుతి దాడిలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. దర్బారా జిల్లాలోని షాగైలో గ్రామ పెద్ద అంతిమయాత్రపై ఉగ్రవాది అత్మాహుతి దాడి జరిపినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో గాయపడ్డ 30 మందిని ఆసుపత్రికి తరలించారు.