ఆర్టికల్‌ 370ని ఎత్తివేయాలి:కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌:జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న 370ని వెంటనే ఎత్తివేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.జమ్మూకాశ్మీర్‌కు మరిన్ని ప్రత్యేక అదికారాలు కల్పించాలంటూ ముగురు సభ్యులతో కూడిన కమిటీ కేంద్రానికి సిఫార్సు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.కమిటీ నివేదికకు నిరసనగా జమ్యూకాశ్మీర్‌ పరిరక్షణ సమితి ఇందిరా పార్కు వద్ద తలపెట్టిన భారీ ధర్నాలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు వేల మంది సైనికులు ఆత్మత్యాగం చేశారని వారి త్యాగాలను అవహేళన చేసేలా కమిటీ ప్రవర్తించిందని మండిపడ్డారు.అక్కడి ప్రత్యేక చట్టాలను రద్దు చేసి సాధారణ పరిస్థితులు కల్పించాలని కోరారు.ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి అధికారాలున్నాయో అదేవిధమైన పరిస్థితులు జమ్మూకాశ్మీర్‌లో కల్పించాలని సూచించారు.