ఆర్టీఏ అధికారుల పేరుతో వసూళ్లు

వరంగల్‌: తొర్రూరు మండలం బొడ్లాడ వద్ద నలుగురు వ్యక్తులు ఆర్టీఏ అధికారుల పేరుతో వసూళ్ళకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యగులు ఉన్నారు. వీరితోపాటు కారునుకూడా స్వాధీనం చేసుకున్నారు.