ఆర్టీసీని ఆదరిస్తున్న మహిళా ప్రయాణికులకు సన్మానం
జనం సాక్షి , మంథని : మహిళా దినోత్సవం సందర్భంగా మంథని బస్టాండ్ నందు ప్రతిరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఆర్టీసీని ఆదరిస్తున్న ఆరుగురు మహిళా ప్రయాణికులకు శాలువా, ప్రశంసా పత్రాలతో సోమవారం ఘనంగా సన్మానించారు. మంథని డిపో మేనేజర్ శ్రీనివాస్ ఆదేశానుసారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంథని ఎస్ టి ఐ.ఏoజల్ , బస్టాండ్ కంట్రోలర్ రాజిరెడ్డి, ఎస్ డి ఐ.గోపాల్ , బి కే.గణేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.