ఆర్టీసీ-ఎన్‌ఎంయూ చర్చలు విఫలం

హైద్రాబాద్‌: తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ యాజమాన్యంతో నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ చర్చలు విఫలమయ్యాయి. ఈ నెల 17న మరోసారి చర్చలు జరపాలని సంఘం నేతలు నిర్ణయించారు. తమ 36 డిమాండ్లలో ఏ ఒక్క దాని పైనా యాజమాన్యం స్పష్టమైన హామీ ఇవ్వలేదని ఎన్‌ఎంయూ నేత మహమూద్‌ తెలిపారు. ఈ నెల 20లోపు హామీ రాకపోతే రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.