ఆర్టీసీ కార్మికులపై సాంబశివరావు అనుచిత వ్యాఖ్యలు

 హైదరాబాద్: ఆర్టీసీ కార్మిక సంఘాలపై ఎండీ సాంబశివరావు ఫైర్‌ అయ్యారు. వారి తీరుతో ఆర్టీసీ ప్రజల మద్దతు కోల్పోతుందన్నారు. కార్మికులు బస్సులను అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కాంట్రాక్ట్ కార్మికులు రేపు విధులకు హాజరుకాకపోతే వారిని తొలిస్తామన్నారు. విధుల్లో పాల్గొంటున్న డ్రైవర్లకు భవిష్యత్‌ రిక్రూట్‌మెంట్‌లో 30 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని.. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్‌ చేస్తామని సాంబశివరావు హామీ ఇచ్చారు. ఎంసెట్‌ సందర్భంగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. తాత్కాలిక డ్రైవర్ల సహాయంతో ఈరోజు 10 శాతం మేర సర్వీసులను నడిపినట్లు సాంబశివరావు తెలిపారు.