ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌తో కేటీఆర్ సమావేశం
హైదరాబాద్ జనంసాక్షి : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌తో మరో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. బడ్జెట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు నిధుల కేటాయింపుపై చర్చించారు. ఈ సందర్భంగా జలహారానికి రూ.6వేల కోట్లు, పంచాయతీరాజ్ రోడ్లు మర్మమతులకు రూ.5,470 కోట్లు, పింఛన్లకు రూ.4,900 కోట్లు, ఐటీ రంగానికి రూ.250 కోట్లు, పల్లె ప్రగతికి రూ.100 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు.