ఆర్థిక సంస్కరణలపై చర్చించేందుకు కేంద్రమంత్రివర్గ భేటీ

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7 శాతం కరవుభత్యం పెంపు ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించింది. ఆర్థిక సంస్కరణలపై చర్చించేందుకు కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ భేటీ అయింది. రేషన్‌ చక్కెర ధర పెంపు, దుకాణాలు, రాష్ట్ర విద్యుత్‌ బోర్డుల పునర్‌ వ్యవస్థీకణతో పాటు పలు అంశాలపై ఉపసంఘం చర్చించింది.