ఆశా కార్యకర్తల సేవలు కృషి, సామాజిక, శారీరక ఆరోగ్యానికి తోడ్పాటు
మండలాధ్యక్షుడు పుప్పాల శ్రీనివాస్ గౌడ్.
బిజినేపల్లి. జనం సాక్షి. సెప్టెంబర్.30.
బిజినపల్లి మండల పరిధిలోని లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం నాడు ఏర్పాటుచేసిన సమావేశంలో బిజినెపల్లి మండల పరిషత్ అధ్యక్షులు పుప్పాల శ్రీనివాస్ గౌడ్ ఆశా కార్యకర్తల కు చీరల పంపిణీ చేశారు.
ఆయన మాట్లాడుతూ ఆశా కార్యకర్తల ఆరోగ్య సేవలు గర్భిణీలు, బాలింతలు నవజాత శిశువులకే కాకుండా సామాజిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతున్నాయని ఆయన అభినందించారు. క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న ప్రతి ఆరోగ్య కార్యక్రమాల్లో పాల్గొని సామాజిక ఆరోగ్యానికి ఎంతో కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కరోనా సమయంలో వారు, ఆరోగ్య సిబ్బంది అందించిన ఇంటింటా ఆరోగ్య సేవలను ప్రజలు గుర్తుంచుకుంటారని అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు,బి.పి,షుగర్, క్షయ, కుష్టు, వ్యాధి గ్రస్తులకు కూడా గుర్తించి సేవలు అందిస్తున్నారని, లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పనితీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. మరిన్ని ఆరోగ్యం ఉపకేంద్రాల భవన నిర్మాణాలన్ని శాసనసభ్యులకు తెలియజేసి నిర్మాణం చేపట్టే విధంగా కృషి చేస్తానని అన్నారు. ప్రజా ఆరోగ్య సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ ఆసుపత్రి లోనే ప్రసవాలు, ఆరోగ్య పరీక్ష సేవలు, 100 శాతం ఉండేవిధంగా ఆశా కార్యకర్తలు మరింత కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మంగనూర్ ప్రాదేశిక సభ్యులు వేముల తిరుపతయ్య, లట్టుపల్లి ఆరోగ్య విస్తీర్ణధికారి పోల శ్రీధర్, ఆరోగ్య పర్యవేక్షకురాలు కిష్టమ్మ,కే.సరళ,లాబ్ టెక్నీషియన్ చంద్రశేఖర్ ఆరోగ్య కార్యకర్తలు టి. యాదగిరి, పి పద్మ,,ఎం. బొజ్జమ్మ, హెలెన్, సుమిత్ర,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.