ఆశ వర్కర్లకు యూనిఫాం చీరల పంపిణీ

దౌల్తాబాద్ సెప్టెంబర్ 27, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో పనిచేస్తున్న ఆశ వర్కర్లకు మంగళవారం ఎంపీపీ గంగాధరి సంధ్యా రవీందర్ యూనిఫామ్ చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విధి నిర్వహణలో డ్రెస్ విధానం ఎంతో అవసరం అన్నారు. గ్రామాలలో ఆశ వర్కర్లు చేస్తున్న సేవలు మరువలేనివని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ముత్యం గారి యాదగిరి,వార్డు మెంబర్ మాశెట్టి నరేష్ గుప్తా, డాక్టర్ సుభాషిని,పిహెచ్ఎన్ గీత భవాని, సూపర్వైజర్ శ్రీనివాస్, స్టాఫ్ నర్సులు సుమిత్ర,కవిత, ఆశ వర్కర్లు,నాయకులు రవీందర్, తదితరులు పాల్గొన్నారు.