ఆసరా పింఛన్లు ఇచ్చి పేదల జీవితాల్లో కేసీఆర్ వెలుగులు నింపారు.
ఎంపీపీ బి. రాణీ బాయి రామారావు.
మహాదేవపూర్ (కాళేశ్వరం )సెప్టెంబర్ 03 జనంసాక్షి న్యూస్ : ఆసరా పెన్షన్లు ఇచ్చి పేదల జీవితాలలో ముఖ్య మంత్రి కేసీఆర్ వెలుగును నింపారని ఎంపీపీ బి. రాణీ బాయి రామారావు అన్నారు. శని మండలంలోని ఎడపల్లి, కుడురుపళ్లి, మేట్ పల్లి, కాళేశ్వరం గ్రామాలలో నూతన ఆసరా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎంపీపీ బి. రాణీ బాయి రామారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నూతన ఆసరా పెన్షన్ల వలన నిరుపేదల జీవితాలలో వెలుగును నింపాయని అన్నారు. మండలంలో 4163 మందికి పింఛన్లు ఇస్తుండగా ముఖ్య మంత్రి కేసీఆర్ నూతనంగా మరో 820 మందికి పెన్షన్లు మంజూరు అయ్యాయని ఎంపీపీ అన్నారు. మహాదేవ పూర్ మండలంలో నాలుగు గ్రామాలలో ఎడపల్లి గ్రామంలో పాత పించండ్లు 49 ఉండగా నూతనంగా 12 మందికి, కుదురు పల్లి గ్రామంలో 104 పాతవి, 17 కొత్తవి, మేట్ పల్లి లో పాతవి 91, కొత్తవి 13, కాళేశ్వరం లో 385 పాతవి, 57 కొత్త పింఛన్లు మంజూరు చేశామని ఎంపీపీ అన్నారు.. పింఛన్ల తీసుకున్న లబ్దిదారులు కేసీఆర్ కు రుణ పడి ఉండాలని అన్నారు.. దేశంలో మరే రాష్ట్రంలో ఇంత ఎక్కువ పెన్షన్ ని ఎవరు ఇవ్వడంలేదని, తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వమే పేదలను ఆదుకునేందుకు నూతన పెన్షన్లను మంజూరు చేసిందని ఎంపీపీ అన్నారు. గత మే ,జూన్ నెలలలో కొన్ని రాష్ట్రాలలో కరెంటు కోతలు పెట్టారని, మన రాష్ట్రంలో ప్రభుత్వం 24 గంటల కరెంటును అందజేసిందని ఎంపీపీ తేలిపారు. కోవిడ్ మహమ్మారి వలన నూతన పెన్షన్లు కొంత ఆలస్యమైందని, మండలంలో అర్హులైన అందరికీ పెన్షన్స్ మంజూరు చేయడం జరిగిందని, ఇంకా పింఛన్ల రానివారు ఎవరైనా ఉంటే మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఎంపీపీ అన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ రెండు డోసులు వేసుకున్న వారు మూడో డోసు కూడా వేసుకోవాలని అందరూ వైద్య సిబ్బందికి సహకరించాలని ఈ సందర్భంగా ఎంపీపీ కోరారు. తెలంగాణ రాష్ట్రం రాకుంటే గ్రామాల పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఊహించుకోవాలి అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత పట్టణాలకు ధీటుగా పల్లెలు అభివృద్ధి చెందాయని అన్నారు. తెలంగాణ రాకముందు 200రూపాయలు ఉన్న పెన్షన్లను టి.ఆర్.ఎస్ పార్టీ అధికారం లోకి రాగానే 10రేట్లు పెంచి 2వేల రూపాయలు ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల లోని ప్రజలు తెలంగాణ లో అమలవుతున్న పథకాల వైపు చూస్తున్నారని అన్నారు. సీఎం కేసిఆర్ గారికి ప్రజల లో వస్తున్న ఆదరణ చూడలేక ప్రతి పక్ష పార్టీల నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రతి పక్ష పార్టీల నాయకులకు బుద్ది చెప్పాలని ఎంపీపీ బి రాణీ బాయి రామారావు కోరారు. కార్యక్రమంలో ఎంపిడిఓ శంకర్ నాయక్, ఎంపీఓ ప్రసాద్, ఎంపీటీసీ మమత నాగరాజు, సర్పంచ్ కుమ్మరి మల్లయ్య, కోట లక్ష్మి సమ్మయ్య, శోభారాణి, వసంత మోహన్ రెడ్డి, కార్యదర్శులు అంజలిరెడ్డి, ఇందిర, గాయత్రి, సత్యనారాయణ, లబ్దిదారులు పాల్గొన్నారు.. Attachments area
|