ఆస్ట్రేలియా స్క్వాష్‌ ఓపెన్‌లో దీపిక ఓటమి

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా స్క్వాష్‌ ఓపెన్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి దీపికా పల్లికిల్‌ ఓటమి పాలైంది. శనివారం జరిగిన సెమీఫైనాల్‌లో ఆమె ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ ఇంగ్లండ్‌కు చెందిన లౌర మస్సారో చేతిలో 7-11, 11-7, 13-11, 11-3, 9-11 తేడాతో పరాజయం పాలైంది. మొదటి సెట్‌ కోల్పోయిన తర్వాత రెండు, నాలుగు సెట్‌లు గెల్చుకుంది. అయితే మస్సారో మూడు సెట్‌లు నెగ్గింది. చక్కని ఫామ్‌లో ఉన్న 11వ సీడ్‌ దీపిక క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ అమెరికాకు చెందిన అమెండ సోబిని 11-5, 11-7, 12-10తో కంగుతినిపించింది. ఆస్ట్రేలియన్‌ స్క్వాష్‌ ఓపెన్‌లో సెమీఫైనల్‌లో ప్రవేశించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది