ఇంజినీరింగ్, ఫార్మసీ సీట్ల కేటాయింపు ఖారారు
హైదరాబాద్: ఈ నెల 14న సాయంత్రం 6 గంటల తర్వాత ఇంజినీరింగ్, ఫార్మసీ సీట్ల కేటాయింపు ఖరారు చేస్తామని ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రధానాధికారి రఘునాధ్ వెల్లడించారు. విద్యార్థులు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఎంపిక చేసుకున్న అప్షన్లు, ప్రతిభ ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుందని ఆయన చెప్పారు. తాము కోరుకున్న కళాశాలలో సీటు దక్కితే ఈ నెల 20 లోపు ఆయా కళాశాలల్లో విద్యార్థులు తమ వివరాలు అందజేయాల్సి ఉందని రఘునాథ్ చెప్పారు. ఈ నెల 28, 29 తేదిల్లో రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభించే అవకాశం ఉందన్నారు. ఎంసెట్‌లో 2లక్షల 7 వేల మంది విద్యార్థులు అర్హత సాధించగా మొదటి విడత కౌన్సెలింగ్‌లో లక్ష 36వేల 486 మంది అప్షన్లు ఇచ్చారు.



