ఇంజినీరింగ్ యాచమాన్య కోటా దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్: ఈ నెల 12 నుంచి 22 వరకు ఇంజినీరింగ్ యాజమాన్య కోటా దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. సీట్ల వివరాలు ఆప్‌లోడ్ చేసేందుకు ప్రైవేటు కళాశాలలకు ఈ నెల 24 వరకు అవకాశం ఇస్తున్నట్లు ఉన్నత విద్యామండలి పేర్కొంది. ఈ నెల 28న ఇంజినీరింగ్ యాజమాన్య కోటా సీట్ల మెరిట్ జాబితా ప్రకటిస్తారు. అక్టొబరు 20న మొత్తం ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో యాజమాన్యం కోటా సీట్ల భర్తీ వివరాలు వెల్లడిస్తారు.