ఇంటర్‌ సప్లమెంటరీ ఫలితాల్లో ప్రజ్ఞ విద్యార్థికి ప్రథమ స్థానం

నర్సంపేట, జూన్‌ 17(జనంసాక్షి) :
ఇంటర్మీడియట్‌ సప్లమెంటరీ ఫలితాల్లొ స్థానిక ప్రజ్ఞ జూనియర్‌ కళాశాల విద్యార్తి గద్దె రాజేష్‌ సైన్స్‌ గ్రూపులో 983 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచాడు. కొత్తపల్లి నరేష్‌ 980, దూపటి రవళి 979 మార్కులు సాధించి జిల్లా టాపర్లుగా నిలిచారు. వీరిని ప్రజ్ఞ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ సాగర్‌, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.