ఇంటిదొంగలను తరిమికొట్టేందుకు మహిళా లోకం సిద్ధం కావాలి

నర్సంపేట, మే 24 (జనంసాక్షి):
తెలంగాణ ఉద్యమాన్ని నీరు కార్చేందుకు ప్రయత్నిస్తు తెలంగాణ ద్రోహులను తరిమికొట్టాలని తెలంగాణ మహిళ జేఏసీి డివిజన్‌ కన్వీనర్‌ గుడిపుడి అరుణా రాంచందర్‌ అన్నారు. గురువారం పట్టణంలోని జేఏసీ కార్యాలయంలో మహిళ జేఏసీ కోకన్వీనర్‌ రామగిరి మాధవి అధ్యక్షతన సమవేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అరుణా రాంచందర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న క్రమంలో మేము తెలంగాణ వాదులమేనని చెప్పుకుంటూ సీమాంధ్రులక కీలు బొమ్మగా మారి ఉద్యమాన్ని భ్రుష్టుపట్టిస్తున్న ఇంటి దొంగలను తరిమేందుకు మహిళా లోకం సిద్ధం కావాలన్నారు. కొండ సురేఖ మహిళ అయ్యి కూడా సమాఖ్య వాది వైఎస్‌ జగన్‌కు మధ్దతు తెలుపుతూ తెలంగాణ ఉద్యమకారులపై మానుకోట ఘటనలో రాళ్లు రువ్వడం, విచక్షణా రహితంగా మాట్లాడటం దారుణమన్నారు. ఆ ఘటనకు నిరసనగా ఈ నెల 26 నుంచి 28 వరకు నిర్వహింపబడే జేఏసీ పాదయాత్రను మహిళా లోకం అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో పెరుక కరుణ, రజిత, యాస్మిని, పద్మ, విజయలక్ష్మి, విజయ, సుగుణ తదితరులు పాల్గొన్నారు.