ఇందిరాపార్కు వద్ద ధర్నా

హైదరాబాద్‌ : రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఇందిరా పార్కు వద్ద తెదేపా, సీపీఐ, లోక్‌సత్తా రైతుసంఘాల ధర్నా ప్రారంభమైంది.తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తదితరులు ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్దకు బయలుదేరారు. పెద్దసంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు.