ఇందిరాపార్కు వద్ద సీపీఐ ధర్నా ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణ సాధనే ధ్యేయంగా సీపీఐ ఇందిరాపార్కు వద్ద చేపట్టిన సామూహిక ధర్నా ప్రారంభమైంది. సాయంత్రం వరకూ జరగనున్న ఈ ధర్నాలో సీపీఐతోపాటు తెరాస, తెదేపా, రాజకీయ ఐకాస నేతలు పాల్గొంటారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం ఈ ధర్నాకు హాజరవుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో తమ పాత్ర కీలకమని ఈ ధర్నా ద్వారా చాటిచెప్పాలని సీపీఐ భావిస్తోంది.

తాజావార్తలు