ఇంద్రకీలాద్రిపై కోటి కుంకుమార్చన ప్రారంభం

విజయవాడ: లోక కల్యాణార్థం బెజవాడ శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఆలయంలో చేపట్టిన కోటి కుంకుమార్చన ఘనంగా ప్రారంభమైంది. దేవస్థానానికి చెందిన పండితులతోపాటు రుత్వికుల మంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకూ జరిగిన కుంకుమ పూజలో భక్తులు పాల్గొన్నారు.ఈ వేడుకల్లో భాగంగా సాయంత్రం నుంచి కోటివత్తి దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.