*ఇంద్రపాలనగరంలో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన డిసిపి నారాయణరెడ్డి ఏసిపి ఉదయ్*.

     రామన్నపేట సెప్టెంబర్ 1 (జనంసాక్షి)

మండల కేంద్రంలోని ఇంద్రపాలనగరం గ్రామంలో పెద్ద చెరువు వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణేష్ నిమర్జనం ఏర్పాట్లను డీసీపీ నారాయణరెడ్డి, ఏసిపి ఉదయ్ స్థానిక  పోలీసులతో కలిసి పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిమర్జన కార్యక్రమం పూర్తి చేయలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట ఏ ఎస్ఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది మరియు ఇంద్రపాలనగరం టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గర్దాసు విక్రమ్ నాయకులు సింగనబోయిన జంగయ్య, సింగనబోయిన గణేష్ ,శ్రీను, రజినీకాంత్ ,వినోద్, శ్రీకాంత్, సాయి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.