ఇక రాష్ట్రంలో భూ పంచాయితీలు ఉండవ్
– త్వరలోనే భూముల లెక్కలకు ముగింపునిస్తాం
– 3,500 గ్రామాల్లో ఇప్పటికే భూప్రక్షాళన పూర్తిచేశాం
– మిగిలిన ప్రాంతాల్లో డిసెంబర్ 31వరకు పూర్తిచేస్తాం
– 100శాతం పారదర్శకతతో భూ ప్రక్షాళన సర్వే
– జనవరి 26 నుంచి కొత్తపాస్‌పుస్తకాలు జారీ
– సాదా బైనామాలో రికార్డు సృష్టించాం
– గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం
– రిజిస్టేష్రన్ ప్రక్రియ సులభతరం చేస్తాం
– భూప్రక్షాళనపై చర్చలో ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, నవంబర్7(జనంసాక్షి): రాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. త్వరలోనే భూముల లెక్కలకు ముగింపు పలకబోతున్నామని సీఎం ఉద్ఘాటించారు. భూముల లెక్కలు తీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నందునే.. భూరికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు. శాసనసభలో భూరికార్డుల ప్రక్షాళనపై లఘు చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. భూరికార్డుల ప్రక్షాళనపై అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని సీఎం స్పష్టం చేశారు. భూరికార్డుల ప్రక్షాళనపై సుమారు 30 నుంచి 40 సమావేశాలు ఏర్పాటు చేసి సవిూక్షించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నూటికి నూరు శాతం పారదర్శకతతో భూరికార్డుల ప్రక్షాళన జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు జరుగుతున్న ప్రక్షాళనలో రెండు భాగాలుగా ప్రక్షాళన జరగుతుందని, ఒకటి.. భూములకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు, ఫారెస్ట్, కోర్టు పరిధిలో ఉన్న భూముల జోలికి పోవద్దని అధికారులకు సూచించామని తెలిపారు. రెండోది.. కుటుంబ సభ్యుల మధ్య భూవివాదాలు ఉండే వాటి వద్దకు వెళ్లడం లేదని పేర్కొన్నారు. గ్రామ ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండే భూములను ప్రక్షాళన చేయమని అధికారులకు సూచించామని తెలిపారు.
తెలంగాణ భూభాగం 2.76 కోట్ల ఎకరాలు..
తెలంగాణ భూభాగం 2.76 కోట్ల ఎకరాలు ఉందని సీఎం తెలిపారు. అందులో 10,885 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని, 10,806 గ్రావిూణ ప్రాంత రెవెన్యూ గ్రామాలున్నాయని పేర్కొన్నారు. మొదటగా గ్రావిూణ ప్రాంత రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేయాలని సూచించాం. ఎందుకంటే గ్రావిూణ ప్రాంతాలకు మొదటగా పెట్టుబడి ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం స్పష్టం చేశారు. 1,418 అధికారుల బృందాలు ఎండ, వాననక తట్టుకొని.. భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో పాల్గొంటున్నాయని తెలిపారు. సెప్టెంబర్ 15న ప్రారంభమైన ఈ కార్యక్రమం డిసెంబర్ 31న ముగుస్తుందన్నారు. రైతులకు పాస్‌పోర్టు కంటే పటిష్టంగా ఉండే పాస్‌బుక్‌లను పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 60 శాతం భూ రికార్డుల ప్రక్షాళన జరిగిందన్నారు. మిగిలిన 40 శాతం త్వరలోనే పూర్తవుతుందన్నారు. మొదటి విడుతగా 6,246 గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టారు. 3 వేల గ్రామాల్లో భూరికార్డుల ప్రక్షాళన పూర్తయిందన్నారు. 14 జిల్లాల్లో 90 శాతం భూరికార్డుల ప్రక్షాళన పూర్తి అయినట్లు సీఎం చెప్పారు. జగిత్యాల జిల్లాలో 99 శాతం భూరికార్డుల ప్రక్షాళన పూర్తి అయిందని సీఎం స్పష్టం చేశారు. గ్రామంలో వివాదం లేకుండా ఎవరి భూమిని వారికి నిర్ధారించిన తర్వాత ఎవరి భూమి ఎంత
అని పారదర్శకంగా ప్రకటించాలని అధికారులకు ఆదేశాలిచ్చామని సీఎం పేర్కొన్నారు. ఆ తర్వాత గ్రామంలోని రైతులందరి భూముల వివరాలను గ్రామపంచాయతీ గోడలకు అతికించాలని సూచించామని తెలిపారు సీఎం. ఇందులో 100 శాతం పారదర్శకత ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
సాదా బైనామాలో రికార్డు సృష్టించాం..
సాదా బైనామాల విషయంలో తమ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని సీఎం తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ,93,654 దరఖాస్తులు వస్తే ఫీజు తీసుకొని 11,653 దరఖాస్తులు పరిష్కరించారని గుర్తు చేశారు. అంటే కేవలం నాలుగు శాతం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. తమ ప్రభుత్వంలో సాదా బైనామాల కోసం 11,19,111 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో 6,18,368 దరఖాస్తులను పరిష్కరించాం. మిగతావి పరిశీలనలో ఉన్నాయి.. వాటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో రైతుల సంఖ్య 55 లక్షల ముంది ఉన్నారని నిర్ధారణ ఉందని, భూరికార్డుల ప్రక్షాళనతో రైతుల సంఖ్య ఎంతో స్పష్టంగా తెలుస్తుందన్నారు. భూరికార్డుల ప్రక్షాళనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పత్రికలు, ఎలక్టాన్రిక్ విూడియాలో ప్రకటనల కోసం రూ. 7 కోట్ల 35 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాం. వందల కోట్లు ఖర్చు పెట్టారని భట్టి విక్రమార్క అనడం కరెక్ట్ కాదని సీఎం అన్నారు.
నయీం ముఠాను సృష్టించింది ఏవరు?
నయీం లాంటి నరరూప రాక్షసులను పెంచిపోషించింది ఏవరు? సృష్టించింది ఏవరు? అని సీఎం కేసీఆర్ కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి ప్రశ్నించారు. నయీం భూములు అనేవి ఉండవు అని సీఎం తెలిపారు. నయీం అనే వ్యక్తి మమూలు ప్రజల యొక్క భూములను లాక్కున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చింది. దీనిపై వివరాలు వచ్చిన తర్వాత సభ ముందు పెడుతామన్నారు. మియాపూర్ భూములపై పూర్తిస్థాయిలో వివరాలు ప్రభుత్వం సభముందు ఉంచడమే కాకుండా చర్చకు కూడా సిద్ధంగా ఉందన్నారు సీఎం స్పష్టం చేశారు.
గత ప్రభుత్వాల వల్లే ఈ కష్టాలు..
భూముల వివరాలు, రికార్డుల గురించి రైతులు పడే కష్టాలకు అంతు లేదని సీఎం తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి దాపురించిందన్నారు. కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలంలో ఒక్కొక్క గ్రామంలో చాలా భయంకరమైన నిజాలు బయటపడ్డాయని సీఎం తెలిపారు. భూముల లెక్కల్లో ఎక్కడా రాతలకు, కొలతలకు సంబంధం లేకుండా ఉందన్నారు. ఇదంతా గత ప్రభుత్వాలు భూరికార్డులను ప్రక్షాళన చేయకపోవడమేనని సీఎం చెప్పారు. వెబ్‌ల్యాండ్ పరిస్థితి అయితే చిత్రవిచిత్రమని చెప్పారు. భూముల లెక్కలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయని సీఎం తెలిపారు. శావిూర్‌పేట మండలంలోని లక్ష్మాపూర్ గ్రామానికి రెవెన్యూ మ్యాప్ లేదన్నారు. భూరికార్డులకు.. వాస్తవాలకు చాలా తేడా ఉందన్నారు. భూ కబ్జాలు, డబుల్ రిజిస్టేష్రన్స్ జరిగాయని తెలిపారు. నకిలీపాసుపుస్తకాలతో పైరవీకారులు చెలరేగిపోయారని సీఎం పేర్కొన్నారు.
రెవెన్యూ వ్యవస్థను రూపొందించింది సాలార్‌జంగ్ -1..
నిన్న భూప్రక్షాళన చర్చపై భట్టి చేసిన వ్యాఖ్యలకు గుర్తుచేస్తూ సీఎం ప్రసంగం చేశారు. హైదరాబాద్ తహశీల్ వ్యవస్థను తీర్చిదిద్దిన మహానుభావుడు సాలార్‌జంగ్ -1 అని సీఎం తెలిపారు. సాలార్‌జంగ్ 1 చేపట్టిన ఈ వ్యవస్థను సాలార్‌జంగ్ 2 పూర్తి చేశారని సీఎం గుర్తు చేశారు. 1932-34 వరకు ఆ
రోజున్న నిజాం రాజు.. భూముల లెక్కలు తీశారు అని సీఎం పేర్కొన్నారు. ప్రపంచలోని ఎవరూ చేయని మంచి పనులను నిజాం రాజు చేశారని గుర్తు చేశారు. నిజాం హయాంలో జరిగిన మంచి పనులను గత ప్రభుత్వాలు చెరిపివేశాయన్నారు సీఎం. నిజాం రాజు ఒక రాజుగా ఉండి సర్వస్వతంత్ర హైకోర్టును ఏర్పాటు చేసిన మొదటి వ్యక్తి నిజాం రాజు అని గుర్తు చేశారు. జల్ జంగిల్ జవిూన్ ఉద్యమం వస్తే హెమన్ డార్ఫ్‌తో కమిషన్ వేసి లక్షా ఎకరాలు ఆదిలాబాద్ ఆదివాసీలకు పంచిపెట్టిన ఘనత నిజాం రాజుది. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణ రెవెన్యూ చట్టం భిన్నంగా ఉంటుందన్నారు సీఎం.
జనవరి 26న కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తాం…
వచ్చే ఏడాది జనవరి 26న కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. జనవరి 26న శాసనసభ్యులందరూ తమ తమ నియోజకవర్గాల్లో రైతులకు పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. కొత్త పాస్‌బుక్‌లను 26 సెఫ్టీ ఫీచర్లతో రూపకల్పన చేస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా పాస్‌బుక్స్ ఉండవని సీఎం తేల్చిచెప్పారు. పాస్‌పోర్టు తరహాలో పటిష్టంగా పాస్‌బుక్స్ ఉంటాయన్నారు. కొత్తగా వచ్చే పట్టాదారు పుస్తకాలు నెల రోజులు నీటిలో పడేసిన ఏం కాదన్నారు. వాటర్ ప్రూఫ్‌తో ఉంటుందన్నారు. ప్రత్యేకమైన పెన్నుతో రాస్తేనే దానిపై పడుతుందన్నారు. ఇష్టమొచ్చిన పెన్నుతో రాస్తే దానిపై పడదన్నారు. సంబంధిత అధికారులకు కేటాయించిన స్పెషల్ పెన్నులతోనే ఆ పాస్‌బుక్స్‌పై రాసేందుకు వీలు ఉంటుందన్నారు. ప్రతి రైతుకు ఒక సర్వే నంబర్ కేటాయించాలనేది తన ప్రతిపాదన అని సీఎం తెలిపారు. రైతుకు ఎన్ని చోట్ల భూమి ఉన్నా.. ఒకే సర్వే నంబర్ ఇస్తే బాగుంటుందని సీఎం చెప్పారు. రైతులు చాలా ఆనందంగా ఉండేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మునుపెన్నడూ లేని విధంగా రైతుల్లో సంతోషం నింపుతామని సీఎం తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఎకరానికి నాలుగు వేల చొప్పున ఇచ్చే పెట్టుబడి రైతుల ఖాతాల్లోకి నేరుగా చేరుతుందన్నారు. భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా రెవెన్యూ అధికారులకు రైతులు సహకరించాలని సీఎం కోరారు.
రిజిస్టేష్రన్ ప్రక్రియ సులభతరం చేస్తాం..
రిజిస్టేష్రన్ ప్రక్రియ విధానం ప్రస్తుతం అస్పష్టతగా ఉందని పేర్కొన్న కేసీఆర్… త్వరలో ప్రస్తుత రిజిస్టేష్రన్ ప్రక్రియలో పూర్తిమార్పులు తెస్తామన్నారు. ఒక్కరోజులోనే రిజిస్టేష్రన్ ప్రక్రియ పూర్తయ్యేలా, వెంటనే ఆన్‌లైన్ ప్రక్రియకూడా పూర్తయ్యేలా నూతన విధానాన్ని తెస్తామన్నారు. రాష్ట్రంలోని 445 తహసీల్దార్ కార్యాలయాలకు సబ్ రిజిస్టార్ర్ అధికారాలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. 141 రిజిస్టేష్రన్ కార్యాలయాలను యథాతథంగా కొనసాగిస్తామన్న కేసీఆర్, తహసీల్దార్లకు మ్యటేషన్ అధికారం ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతి రెవెన్యూ కార్యాలయంలో ఐటీ అధికారులను నియమిస్తామని ప్రకటించారు. రైతులు రిజిస్టేష్రన్ కార్యాలయానికి ఒకసారి వెళ్తే సరిపోతుందన్నారు. భూముల క్రయ, విక్రయాల వివరాలు ఒక్క రోజులోనే ఆన్‌లైన్‌లో తెలవాలని సీఎం చెప్పారు. కోర్ బ్యాంకింగ్ నెట్‌వర్క్ మాదిరిగా భూముల వివరాలు తెలుస్తాయన్నారు. రైతులకు పాస్‌పుస్తకాలు కొరియర్ ద్వారా ఇంటికి చేరేలా చేస్తామని సీఎం తెలిపారు. కాంగ్రెస్ తీసుకువచ్చిన సీలింగ్ చట్టం అశాస్తీయంగా ఉందన్న సీఎం విూ సేవ, వెబ్ ల్యాండ్ వ్యవస్థలు పూర్తిగా విఫలమయ్యాయని తెలిపారు. భూరికార్డులకు సంబంధించి హార్డ్‌కాపీలు తయారు చేయాలని ఆదేశించామని, ఆ కాపీని ఎమ్మెల్యేలందరికీ అందజేస్తామని ప్రకటించారు.



