ఇఫ్పోసిన్‌ 25శాతం మేర వృద్ధిని సాధిస్తోంది

ఛైర్మన్‌ కెవీ కామత్‌

హైదరాబాద్‌: ఐటీ ఆధారిత సేవల్లో ఇన్ఫోసిన్‌ ఏటా 25శాతంమేర వృద్ధిని సాధిస్తోందని ఇన్ఫోసిన్‌ ఛైర్మన్‌ కెవీ కామత్‌ అన్నారు. ఇన్ఫోసిన్‌కు నూతనంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన ఆయన అడ్వాంటేజ్‌ ఏపీ కార్యక్రమంలో పాల్గోన్నారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికి మన దేశంలో ఐటి పరిశ్రమ మాత్రం ఆశ జనక ఫలితాలు రాబడుతున్నాయని మన రాష్ట్రం ఐటి నిపునుల కేంద్రంగా మారిందని గడిచిన పదిహేనేళ్ళలో ఐటీ సేవలందించిన సేవలవల్ల ప్రజలు కొత్త జీవనాన్ని అస్వాధిస్తున్నారని ఆయన అన్నారు.