ఇరాన్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు

ఇరాన్‌: తీవ్ర భూకంపాల ధాటికి అతలాకుతం అయిన ఇరాన్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో  నిరాశ్రయులైన వారి కోసం ఐదు వేల శిబిరాలను అధికారులు ఏర్పాటు చేశారు. శనివారం సంభవించిన ఈ ఘటనలో  మృతుల సంఖ్య  250కి చేరగా 1800 మందికిపైగా క్షతగాత్రులుగా మిగిలారు. శిధిలాల కింద చికుక్కున్న వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.