ఇరువర్గల మధ్య ఘర్షణ: 8 మందికి గాయాలు

విజయనగరం: విజయనగరం జిల్లా గరివిడి మండలం బీజే పాలెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కాంగ్రెస్‌, తెదేపా వర్గాల మధ్య జరిగిన  కొట్లాటలో 8 మందికి గాయాలయ్యాయి, గ్రామంలో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన గొడవను ఆసరాగా చేసుకుని ఇరువర్గాలు రాళ్లు రువ్వుకుని కర్రలతో  కొట్టుకున్నారు. కొట్లాటలో గాయపడిన 8 మందిని చీపులరుపల్లి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి గరివిడి ఎస్‌ఐ కె. రవికుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.